Afzalgunj firing: హైదరాబాద్ లోని అఫ్జల్‌గంజ్‌లో కాల్పుల కేసులో పోలీసులు పురోగతి సాధించారు. దుండగులు వాడిన టూ వీలర్ వాహనం స్వాధీనం చేసుకున్నారు. మహాత్మా గాంధీ బస్టాండ్ పార్కింగ్ ఏరియాలో వాహనాన్ని హస్తగతం చేసుకున్నారు. హైదరాబాద్ శివార్లలో టూ వీలర్ చోరీ చేసిన దుండగులు.. ఆ వాహనంలోనే బీదర్ వరకు వెళ్లి దోపిడి చేసినట్లు గుర్తించారు.