పాకిస్థాన్ మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిదీ మరోసారి భారత హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌పై విమర్శలు గుప్పించాడు. గంభీర్ ప్రారంభంలో తీసుకున్న నిర్ణయాలు ఆత్మవిశ్వాసంతో ఉన్నప్పటికీ.. ఆ తరువాత అతని ఆలోచనలు సరిగా లేవన్నాడు. కొంతకాలం గౌతీ నిర్ణయాలు భారత జట్టుకు ప్రతికూలంగా మారాయని అఫ్రిదీ చురకలు అంటించాడు. మరోవైపు సీనియర్ భారత బ్యాటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ప్రదర్శనలను ప్రశంసించాడు. 2027 వన్డే ప్రపంచకప్ వరకు ఆడగలిగే సామర్థ్యం ఇద్దరిలో ఉందని, భారత జట్టుకు…