ఐసీసీ పురుషుల టీ20 వరల్డ్‌కప్ 2026లో అఫ్గానిస్తాన్ జట్టుకు రషీద్ ఖాన్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. భారత్, శ్రీలంక వేదికలుగా జరగనున్న ఈ మెగా టోర్నీ కోసం అఫ్గానిస్తాన్ క్రికెట్ బోర్డు (ఏసీబీ) 15 మంది సభ్యులతో కూడిన జట్టును ఈరోజు అధికారికంగా ప్రకటించింది. ఇదే జట్టు జనవరి 19 నుంచి ప్రారంభమయ్యే వెస్టిండీస్‌తో జరిగే టీ20 సిరీస్‌లో కూడా పాల్గొననుంది. టీ20 వరల్డ్‌కప్ 2026 జట్టులోకి అనుభవజ్ఞులైన ఆల్‌రౌండర్ గుల్బదిన్ నయిబ్, ఫాస్ట్ బౌలర్ నవీన్-ఉల్-హక్ తిరిగి…