అఫ్గానిస్థాన్ లో చోటు చేసుకుంటున్న తాజా పరిస్థితులను సమీక్షించేందుకు మంత్రులు, ఉన్నతాధికారులతో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఉన్నతస్ధాయి సమావేశం నిర్వహించారు. ఆఫ్ఘన్ లో ప్రభుత్వం ఏర్పాటుకు తాలిబన్లు పూర్తిగా సిద్ధమైపోయారు. ఈ నేపథ్యంలోనే మోడీ ఈ సమావేశం నిర్వహించినట్లు తెలుస్తోంది. గతవారం కూడా భారత పౌరులను స్వదేశానికి తీసుకువచ్చే ఆపరేషన్ సందర్భంలోనూ మోడీ సమీక్ష నిర్వహించారు. తాలిబన్లు ఆక్రమించుకున్న తర్వాత ఆఫ్ఘనిస్థాన్‌లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. పౌరులపై ఆంక్షలు, విభేదించిన వారిపై కఠిన…