ఆఫ్ఘన్ జట్టు కోచ్ జోనాథన్ ట్రాట్ ఆస్ట్రేలియాకు ఓ వార్నింగ్ ఇచ్చాడు. 'ఇప్పుడు ఎవరూ ఆఫ్ఘన్ జట్టును తేలికగా తీసుకోరు. గతంలో కూడా ఆఫ్ఘనిస్తాన్ అద్భుతంగా రాణించింది. ఇప్పుడు మేము మరింత బలంగా ఉన్నాము. తర్వాత జరిగే మ్యాచ్‌లో ఆస్ట్రేలియా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ఈ మ్యాచ్ సెమీ ఫైనల్స్ మార్గాన్ని నిర్ణయించే మ్యాచ్ కావడం వల్ల' అని ట్రాట్ పేర్కొన్నాడు.
ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ జట్టు అసిస్టెంట్ కోచ్‌గా భారత జట్టు మాజీ ఫీల్డింగ్ కోచ్ ఆర్ శ్రీథర్ నియమితులయ్యారు. ఈ విషయాన్ని ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ బోర్డు బుధవారం ఓ ప్రకటనలో తెలిపింది. న్యూజిలాండ్‌తో జరగబోయే ఏకైక టెస్ట్ మ్యాచ్, దక్షిణాఫ్రికాతో జరిగే మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌కు శ్రీథర్ అసిస్టెంట్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టనున్నారు. శ్రీథర్ పని తీరును బట్టి ఒప్పందంపై ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ బోర్డు నిర్ణయం తీసుకోనుంది. ‘న్యూజిలాండ్‌తో ఏకైక టెస్టు, దక్షిణాఫ్రికాతో జరిగే 3 మ్యాచ్‌ల…