Pakistan – Afghanistan: పాకిస్థాన్ పార్లమెంట్‌లో ఆఫ్ఘన్ ప్రకంపనలు భీభత్సం సృష్టించాయి. తాజాగా అక్టోబర్ 9 రాత్రి సమయంలో ఆఫ్ఘన్ రాజధాని కాబూల్ పెద్ద పేలుళ్లతో అతలాకుతలం అయ్యింది. దీంతో పాక్, ఆఫ్ఘనిస్థాన్ మధ్య సంబంధాలు మరోసారి విషమంగా మారాయి. పలు నివేదిక ప్రకారం.. పాక్ వైమానిక దళం (PAF) జరిపిన దాడి కారణంగా కాబుల్‌లో పేలుళ్లు సంభవించాయని తెలుస్తోంది. READ ALSO: Taliban: భారత పర్యటనలో మహిళల్ని దూరం పెడుతున్న తాలిబాన్ ప్రతినిధులు.. పాక్ రక్షణ…
2021లో ఆఫ్ఘనిస్తాన్‌లో పౌర ప్రభుత్వాన్ని దించి తాలిబాన్లు అధికారాన్ని చేజిక్కించుకున్నారు. అప్పటి నుంచి భారత్-ఆఫ్ఘాన్ మధ్య తెరవెనక దౌత్య సంబంధాలు మాత్రమే ఉన్నాయి. ఇప్పటికీ, తాలిబాన్ ప్రభుత్వాన్ని భారత్ గుర్తించలేదు. కానీ, ఇప్పుడు మారుతున్న భౌగోళిక రాజకీయ పరిస్థితుల మధ్య ఆఫ్ఘాన్ అవసరం భారత్‌కు ఎంతో ఉంది. అదే విధంగా తాలిబాన్లకు కూడా భారత్ కావాలి. ఈ నేపథ్యంలోనే, తాలిబాన్ విదేశాంగ మంత్రి అమీర్ ఖాన్ ముత్తాఖీ భారత పర్యటనకు వస్తున్నారు. ఈ పర్యటనలో ముత్తాకీ విదేశాంగ…
Pakistan: తాలిబాన్ల వేధింపుల కారణంగా ఆఫ్ఘనిస్తాన్ వదిలి పాకిస్తాన్ దేశంలోకి శరణార్థులుగా వెళ్లిన వారి పరిస్థితి దారుణంగా మారింది. పాకిస్తాన్, తమ దేశం విడిచివెళ్లాలని ఆఫ్ఘన్ శరణార్థులకు డెడ్‌లైన్ విధించింది. దేశవ్యాప్తంగా ప్రత్యేక రైడ్స్ నిర్వహించి శరణార్థులను గుర్తిస్తోంది. చాలా ఏళ్లుగా పాకిస్తాన్ లో స్థిరపడిన ఆఫ్ఘనిస్తాన్ జాతీయులు ఇళ్లు, వ్యాపారం ఇలా అన్నింటిని వదిలేసి మళ్లీ ఆప్ఘనిస్తాన్ వెళ్తున్నారు.
ఇరాన్‌లోకి అక్రమంగా ప్రవేశించడానికి ప్రయత్నించిన 11 మంది ఆఫ్ఘన్ శరణార్థులు ఇరాన్ సరిహద్దు దళాల చేతిలో చంపబడ్డారని ఖామా ప్రెస్ నివేదించింది. ఇరాన్ సరిహద్దు దళాలు శుక్రవారం పదకొండు మంది ఆఫ్ఘన్ పౌరుల మృతదేహాలను నిమ్రోజ్ సరిహద్దు క్రాసింగ్ వద్ద తాలిబాన్ అధికారులకు అప్పగించారు.