Afghan-Pak War: పాకిస్తాన్‌కు ఆఫ్ఘానిస్తాన్ చుక్కలు చూపిస్తోంది. గత కొన్ని రోజులుగా ఇరు దేశాల మధ్య తీవ్ర ఘర్షణ జరిగింది. తాలిబాన్ దళాలు, పాక్ సైన్యానికి చుక్కలు చూపిస్తోంది. డ్యూరాండ్ రేఖ వద్ద ఆఫ్ఘాన్ దళాలు పాక్ సైన్యానికి చెందిన పలు పోస్టుల్ని స్వాధీనం చేసుకున్నాయి. పలువురు పాక్ సైనికుల్ని నిర్భందించి, కాబూల్‌కు తరలించింది. అంతే కాకుండా పాక్ సైన్యానికి చెందిన ట్యాంకుల్ని కాబూల్ తీసుకెళ్లి, ఊరేగించడం వైరల్‌గా మారింది.