దేశ రక్షణ కోసం విధి నిర్వహణలో కన్న కొడుకు ప్రాణాలు కోల్పోయాడని తెలిసి ఆ కుటుంబం కన్నీరుమున్నీరైంది. కుమారుడి మృతదేహాన్ని తీసుకొచ్చేందుకు వెళ్లిన కుటుంబసభ్యులకు విమానంలో షాకింగ్ అనుభవం ఎదురైంది. కొడుకును కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న వారిని అందరికంటే ముందుగా విమానం నుంచి దింపేందుకు విమాన సిబ్బంది ప్రయత్నించగా తోటి ప్రయాణికులు కనీసం పట్టించుకోలేదు.