Sai Prasad Reddy: ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలో ఉన్న వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలో అసంతృప్తి ఉంది.. సీఎం వైఎస్ జగన్ మంత్రులను, ఎమ్మెల్యేలను పట్టించుకోవడం లేదంటూ విపక్షాలు విమర్శలు చేస్తూ వస్తున్నాయి.. అయితే, ఏకంగా అధికార పార్టీకి చెందిన ఓ ఎమ్మెల్యే కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు సంచలనంగా మారింది.. కర్నూలు జిల్లా ఆదోని నియోజకవర్గానికి చెందిన వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి ఆ వ్యాఖ్యలు చేసి ఇప్పుడు కాకరేపారు.. రాష్ట్రవ్యాప్తంగా జగనన్నే…
Heart Attack: గుండెపోటుతో మృతి చెందుతున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. హైదరాబాద్‌లో రెండు రోజుల క్రితం ఓ కానిస్టేబుల్ జిమ్‌లో వ్యాయామం చేస్తూ గుండెపోటుకు గురై మరణించాడు.
Road Accident: అమెరికాలోని సియాటిల్ నగరంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏపీకి చెందిన ఓ యువతి ప్రాణాలు కోల్పోయింది. మృతురాలు ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లా ఆదోనీకి చెందిన కందుల జాహ్నవి అని పోలీసులు గుర్తించారు. వేగంగా వచ్చిన పోలీస్ కారు ఢీ కొట్టడంతో జాహ్నవికి తొలుత తీవ్రగాయాలయ్యాయి. ఈ ప్రమాదం గురించి తెలుసుకున్న అంబులెన్స్ సిబ్బంది అక్కడికి చేరుకుని యువతిని ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ తుదిశ్వాస వదిలింది. ఈమేరకు ప్రమాదం విషయాన్ని జాహ్నవి కుటుంబ సభ్యులకు…
ఏపీ సీఎం వైఎస్ జగన్.. రేపు (మంగళవారం) కర్నూలు జిల్లాలో పర్యటించనున్నారు.. ఏపీలో రేపటి నుంచి స్కూళ్లు పునఃప్రారంభం కానున్న నేపథ్యంలో.. కర్నూలు జిల్లా ఆదోనిలో రేపు జగనన్న విద్యా కానుక కిట్ల పంపిణీని ప్రారంభించనున్నారు.. వరుసగా మూడో ఏడాది జగనన్న విద్యా కానుక అందిస్తోంది ఏపీ ప్రభుత్వం.. ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో ఒకటి నుండి పదవ తరగతి విద్యార్థులకు విద్యా కానుక అందిస్తున్నారు.. ఆయా పాఠశాలల్లోని 47,40,421 మంది విద్యార్ధిని, విద్యార్థులకు లబ్ధిచేకూరనుంది.. ఇక, కిట్ల…
తెల్లబంగారం అని రైతులు ముద్దుగా పిలుచుకునే పత్తికి మహర్దశ పట్టింది. పత్తి ని తెల్ల బంగారం అన్నది మాటల్లోనే కాదు…వాస్తవంగా కూడా పత్తి తెల్ల బంగారం లా మెరిసిపోతోంది. కర్నూలు జిల్లా ఆదోని మార్కెట్ యార్డులో రోజురోజుకీ పత్తి ధర పెరుగుతూనే ఉంది. దాదాపు మూడు నెలలుగా పత్తి ధర హవా కొనసాగుతూనే ఉంది. కర్నూలు జిల్లాలో ఆదోని మార్కెట్ అతి పెద్ద వ్యవసాయ మార్కెట్. పత్తి, వేరుశనగ పంట పెద్ద ఎత్తున ఆదోని మార్కెట్ కు…
కర్నూలు జిల్లా ఆదోని ఒకప్పుడు టీడీపీకి బాగా పట్టున్న నియోజకవర్గం. ప్రస్తుతం ఆదోని టీడీపీ ఇంచార్జ్‌గా మాజీ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడు కొనసాగుతున్నారు. మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన ఆయన 2014, 2019 ఎన్నికల్లో ఓడిపోయారు. మున్సిపల్ ఎన్నికల్లోనూ 42 వార్డులకు గాను.. టీడీపీకి దక్కింది ఒక్క వార్డే. 5 గ్రామ పంచాయతీలలోనే టీడీపీ మద్దతుదార్లు గెలిచారు. రెండు ఎంపీటీసీలు దక్కాయి. పరిస్థితి ఈ విధంగా దిగజారిపోయినా పార్టీ నేతలు వర్గపోరును విడిచిపెట్టడం లేదు. ఆదోనిలో టీడీపీ పరాజయానికి..…