Heart Attack: గుండెపోటుతో మృతి చెందుతున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. హైదరాబాద్‌లో రెండు రోజుల క్రితం ఓ కానిస్టేబుల్ జిమ్‌లో వ్యాయామం చేస్తూ గుండెపోటుకు గురై మరణించాడు. తాజాగా, కర్నూలు జిల్లా ఆదోనిలో జిమ్‌లో వ్యాయామం చేస్తుండగా ఓ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయాడు. ఆదోనికి చెందిన యువకుడు హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు. ప్రస్తుతం వర్క్ ఫ్రం హోం చేస్తూ ఇంటి వద్దే ఉంటున్నాడు. ఇటీవలే అతడికి పెళ్లి కుదిరింది. నిన్న ఉదయం పట్టణంలోని ఓ జిమ్‌కు వెళ్లాడు.
Read Also: Preeti Phone Call : ‘అమ్మా నాకు భయమేస్తోంది’.. ప్రీతి ఆడియో లీక్
అక్కడ వ్యాయామం చేస్తుండగా కళ్లు తిరుగుతున్నట్టు అనిపించడంతో స్నేహితుడితో కలిసి బయటకు వచ్చాడు. ఆ తర్వాత స్నేహితుడు నీళ్లు తెచ్చేందుకు వెళ్లాడు. అదే సమయంలో మూర్ఛ వచ్చి పడిపోయాడు. స్థానికులు స్పందించి సపర్యలు చేయడంతో కాసేపటికి తేరుకుని మళ్లీ కుప్పకూలిపోయాడు. దీంతో వెంటనే అతడిని పట్టణంలోని ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే అతడు మృతి చెందినట్టు నిర్ధారించారు.
Read Also: SSMB 28: రేపటి నుంచే కొత్త షెడ్యూల్ షురూ… శ్రీలీలా జాయిన్ అవుతోంది
ఇది ఇలా ఉండగా.. కుభీర్ పార్డీ కే గ్రామంలో విషాదం నెలకొంది…పెళ్లి వేడుకలో డ్యాన్స్ చేస్తూ ఓ యువకుడు కుప్పకూలాడు. ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే గుండెపోటుతో చనిపోయినట్లు వెద్యులు తెలిపారు. కన్నడ క్రేజీ హీరో పునీత్ రాజ్‌కుమార్ కూడా ఇలానే వ్యాయామం చేస్తూ గుండెపోటుతో మరణించారు. బాలీవుడ్ మోడల్, నటుడు సిద్ధాంత్ వీర్ సూర్యవంశీ కూడా ఇలానే జిమ్ చేస్తూ ప్రాణాలు కోల్పోయారు. టీమిండియా మాజీ సారథి సౌరవ్ గంగూలీ కూడా వ్యాయామం చేస్తుండగా గుండెపోటుకు గురైనా వైద్యులు సకాలంలో స్పందించి ఆపరేషన్ చేయడంతో కోలుకున్నారు.