కేరళలోని తిరువనంతపురంలో పద్మనాభ స్వామి ఆలయం ఉంది. చాలా సంవత్సరాలుగా భక్తులు స్వామివారిని విశ్వసిస్తూ.. దర్శించుకుంటున్నారు. తాజాగా ఈ టెంపుల్‌కి సంబంధించిన ఓ వార్తపై భక్తులు ఆగ్రహం వ్యక్తి చేస్తున్నారు. అయితే.. రూ.1.57 కోట్ల జీఎస్టీని చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఆలయ నిర్వాహకులకు జీఎస్టీ విభాగం నోటీసు పంపింది. ఏడేళ్లుగా ఆలయంపై జీఎస్టీ బకాయి ఉందని నోటీసులో పేర్కొంది.