Supreme vs ED: బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత పిటిషన్‌ను సుప్రీంకోర్టు వాయిదా వేసింది. ఈడీ అధికారాలను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ ఈ నెల 26కి వాయిదా పడింది. సుప్రీంకోర్టులో కేసు పెండింగ్‌లో ఉండగా నోటీసులు ఎలా ఇస్తారని కవిత ఈ పిటిషన్ వేశారు.
తెలంగాణ వర్షాకాల అసెంబ్లీ సమావేశాలు నిరవధిక వాయిదా పడింది. గత గురువారం ప్రారంభమైన ఈ సమావేశాలు ఆదివారం వరకు కొనసాగాయి. నాలుగు రోజుల పాటు కొనసాగిన అసెంబ్లీ సమావేశాల్లో.. పలు అంశాలపై చర్చించారు. ఆదివారం అసెంబ్లీలో తెలంగాణ ఆవిర్భావం, సాధించిన ప్రగతిపై స్వల్పకాలిక చర్చ జరిగింది. ప్రభుత్వంలో ఆర్టీసీ కార్మికుల విలీనం బిల్లు, పురపాలక చట్ట సవరణ బిల్లులకు తెలంగాణ అసెంబ్లీ ఆమోదం తెలిపింది.