ఏపీ సీఎం జగన్ దావోస్ టూర్‌లో రాష్ట్రానికి పెట్టుబడులు ఆకర్షించేందుకు పలువురు పారిశ్రామికవేత్తలతో వరుసగా భేటీలు అవుతున్నారు. ఈ సందర్భంగా సీఎం జగన్‌తో ఆర్సెలర్ మిట్టల్ నిప్పన్ స్టీల్ కంపెనీ ఛైర్మన్ ఆదిత్య మిట్టల్ సమావేశమైన సంగతి తెలిసిందే. ఈ మేరకు విశాఖలోని తన ప్లాంట్ విస్తరణ నిమిత్తం రూ.1,000 కోట్ల పెట్టుబడి పెట్టేందుకు ఆదిత్య మిట్టల్ అంగీకరించారు. అంతేకాకుండా కర్నూలు జిల్లా ఓర్వకల్లు పరిధిలో ఇటీవల గ్రీన్ కో నేతృత్వంలో ఏర్పాటైన ప్రపంచంలోనే అతిపెద్ద రెన్యువబుల్…