Aditya L-1: ఇస్రో ప్రయోగించిన ఆదిత్య ఎల్ 1 సోలార్ మిషన్ అంతరిక్ష నౌక విజయవంతంగా దూసుకుపోతోంది. ఇప్పటికే భూమి గురుత్వాకర్షణ శక్తి నుంచి బయటపడిన ఆదిత్య ఎల్1 లాగ్రేంజ్ పాయింట్(L1) వైపు వెళ్తోంది. అయితే సరైన మార్గంలో ఆదిత్య ఎల్1ని ఉంచేందుకు ఇస్రో కీలక ఆపరేషన్ చేపసట్టింది. స్పెస్ క్రాప్ట్ లోని ఇంజన్లను 16 సెకన్ల పాటు మండించి ట్రాజెక్టరీ కరెక్షన్ మ్యాన్‌యూవర్ (TCM )ను నిర్వహించిందని ఇస్రో ఆదివారం తెలిపింది.