(జూలై 18న ‘ఆదిత్య 369’కు 30 ఏళ్ళు పూర్తి) నటసింహ నందమూరి బాలకృష్ణ కెరీర్ లో అనేక అద్భుత విజయాలు ఉన్నాయి. అయితే ఆయన కెరీర్ లోనే కాదు, యావత్ భారతీయ చిత్రసీమలోనే ఓ అపురూపం అనదగ్గ చిత్రం ‘ఆదిత్య 369’. మన దేశంలో తొలి టైమ్ మిషన్ మూవీగా ‘ఆదిత్య 369’ తెరకెక్కింది. ‘బ్యాక్ టు ది ఫ్యూచర్’ అనే చిత్రం స్ఫూర్తితో ఈ సినిమా రూపొందినా, ఎక్కడా ఆ సినిమాను కాపీ కొట్టింది లేదు.…