(అక్టోబర్ 28న అదితీరావ్ హైదరీ బర్త్ డే)పాలరాతి బొమ్మలా నాజూకు షోకులతో ఊరిస్తూంటుంది అదితీరావ్ హైదరీ. భరతనాట్యంలో ప్రావీణ్యం సంపాదించారామె. అదితీరావ్ సంప్రదాయ నృత్యదుస్తుల్లో నర్తిస్తూంటే నటి శోభన నృత్యం గుర్తుకు రాకమానదు. బ్రిటిష్ పాలనలో రాచరికం చూసిన రెండు కుటుంబాల కు చెందిన రక్తం అదితీరావ్ హైదరీలో ఉంది. నటిగా తనకంటూ ఓ గుర్తింపును సంపాదించుకుంటూ సాగుతున్న అదితీరావ్ హైదరీ తెలుగువారినీ తన అభినయంతో ఆకట్టుకుంది. అదితీరావ్ హైదరీ 1986 అక్టోబర్ 28న హైదరాబాద్ లో…