టీమిండియా బౌలర్ మహమ్మద్ సిరాజ్కు ఐసీసీ (ICC) షాక్ ఇచ్చింది. అడిలైడ్ టెస్టులో ఆస్ట్రేలియా బ్యాటర్ ట్రావిస్ హెడ్, భారత ఫాస్ట్ బౌలర్ సిరాజ్ మధ్య వాగ్వాదం జరిగింది. ఈ ఘటనలో సిరాజ్ ఐసీసీ ప్రవర్తనా నియమావళిలోని ఆర్టికల్ 2.5ను ఉల్లంఘించినట్లు గుర్తించింది. దీంతో.. మ్యాచ్ ఫీజులో 20 శాతం జరిమానా విధిస్తూ నిర్ణయం తీసుకుంది.