Weather Update: తెలుగు రాష్ట్రాల్లో చలితీవ్రత రోజు రోజుకు పెరుగుతుంది. దీంతో రాత్రి ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాయి. కాగా.. ఆదిలాబాద్, అల్లూరి జిల్లాల్లో కనిష్ట స్థాయికి ఉష్ణోగ్రతలు పడిపోయాయి. రెండు రాష్ట్రాల్లోనూ కనిష్ట ఉష్ణోగ్రతలు 15 డిగ్రీల కంటే తక్కువగా నమోదయ్యాయి. ఇక ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వాసులను చలి వణికిస్తోంది. రోజురోజుకూ పడిపోతున్న రాత్రి ఉష్ణోగ్రతల కారణంగా జిల్లా వ్యాప్తంగా మంచు కమ్మేసింది. ఉదయం 9 గంటలకు మంచు కమ్ముకోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. ఇక సాయంత్రం ఐదు దాటితే చాలు చలి బారి నుంచి కాపాడుకునేందుకు ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. చలికి తోడు ఈదురు గాలులు జిల్లా వాసులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి.
Read also: Doctors Died In Road Accident: ఎక్స్‌ప్రెస్‌వేపై ప్రమాదం.. ఐదుగురు వైద్యులు మృతి
కొమురం భీం జిల్లా సిర్పూర్ యు లో 7.9 కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదు కాగా.. ఆదిలాబాద్ జిల్లా అర్లిటీ లో 9.2 డిగ్రీలు గా కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇక నిర్మల్ జిల్లా పెంబి లో 10.3 డిగ్రీలుగా ఉంది. మంచిర్యాల జిల్లా తపాలపూర్ లో 12.2 గా కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఉమ్మడి మెదక్ జిల్లాలో చలి తీవ్రత పెరిగింది. సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ లో 9.7 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదయ్యాయి. మెదక్ జిల్లా శివ్వంపేటలో 10.2 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదు కాగా.. సిద్దిపేట జిల్లా పోతిరెడ్డిపేటలో 11.3 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదయ్యాయి. మరోవైపు హైదరాబాద్ లో చలిపంజా విసురుతోంది. దీంతో నగర వాసులు బయటకు వచ్చేందుకు వణుకుతున్నారు. ఉదయం 9 గంటలు అయినా చలి తీవ్రత కొనసాగుతుంది.
Read also: TTD : పద్మావతి అమ్మవారి ఆలయంలో లక్ష కుంకుమార్చన… సాయంత్రం బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ
అల్లూరి సీతారామరాజు జిల్లా జి.మాడుగులలో అత్యల్పంగా 11 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. రానున్న రోజుల్లో ఉత్తరాంధ్ర జిల్లాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే తక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. డిసెంబర్ మొదటి వారం నుంచి చలి గాలులు పెరిగే అవకాశం ఉందని తెలిపింది. ఉత్తర, ఈశాన్య భారతం మీదుగా వీస్తున్న గాలుల ప్రభావంతో రాష్ట్రంలో చలి తీవ్రత పెరుగుతోందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు.
Donald Trump: ట్రంప్ కార్యవర్గంలోకి మరో ఇండియన్.. హెల్త్ డైరెక్టర్‌గా జై భట్టాచార్య