ఈ సీటు నాదే… ఆ జడ్పీ నాదేనంటూ…. ఇన్నాళ్ళు గల్లాలెగిరేసిన నేతల గొంతుల్లో ఇప్పుడు పచ్చి వెలక్కాయలు పడ్డాయి. చూస్తో నా తడాఖా అని తొడలు కొట్టిన వాళ్ళకు ఆ వాపు తప్ప ఇంకేం మిగల్లేదట. ఎక్కడుందా పరిస్థితి? ఏ జిల్లాలోని నాయకులు తీవ్ర నిరాశ నిస్పృహల్లో కొట్టుమిట్టాడుతున్నారు? ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కొంతమంది నేతల పరిస్థితి దారుణంగా మారిందట. జడ్పీ ఎన్నికల్లో మాదే పీఠం..నాకే టికెట్ అంటూ ఇన్నాళ్లు ఉవ్విళ్లూరిన వాళ్ళకు మారిన రిజర్వేషన్స్ గట్టి…
ఆ ఉమ్మడి జిల్లాలో కాంగ్రెస్ ఎమ్మెల్యేల మధ్యనే మంటలు రేగుతున్నాయా? మాటల తూటాలు ఎట్నుంచి ఎటో టర్న్ అయిపోయి ఎవరెవరికో తగులుతున్నాయా? ఒకరకంగా అందుకు పార్టీ అధిష్టానమే కారణం అవుతోందా? పెద్దల నానబెట్టుడు ధోరణి అగ్గికి ఆజ్యం పోస్తోందా? ఇంతకీ ఎవరా ఎమ్మెల్యేలు? ఎందుకా మంటలు? ఉమ్మడి ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలోని పది అసెంబ్లీ సీట్లకుగాను నాలుగు చోట్ల గెలిచింది కాంగ్రెస్. కానీ… జిల్లాకు మంత్రివర్గంలో స్థానం దక్కలేదు. ముందు నుంచి పార్టీలో ఉన్న ఎమ్మెల్యే ప్రేమ్…
ఒకే పార్టీలో ఉన్నారు.. ఒకే జిల్లా నాయకులు. కానీ.. నేతలిద్దరూ తూర్పు-పడమర. మాట మాట్లాడితే ఉప్పు-నిప్పులా ఉంటుంది యవ్వారం. ఆధిపత్యం కోసం ఎత్తులు.. పైఎత్తులు వేస్తున్న సమయంలో కొత్త రగడ తెరపైకి వచ్చింది. అదే ఇప్పుడు కాంగ్రెస్‌లో చర్చ. వారెవరో ఈ స్టోరీలో చూద్దాం. ఇంద్రవెల్లి సభ కాంగ్రెస్ నేతల మధ్య పాత పగలు.. సెగలు రాజేసిందా? ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్‌లో ఇంద్రవెల్లి సభ చిచ్చు పెట్టడంతో పార్టీలో అందరి దృష్టీ.. మాజీ ఎమ్మెల్యే మహేశ్వర్‌రెడ్డి..…