Adi Parvam: మంచు లక్ష్మీ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న చిత్రం ఆదిపర్వం. సంజీవ్ మేగోటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని రావుల వెంకటేశ్వర్ రావు సమర్పణలో అన్వికా ఆర్ట్స్ మరియు ఎ. వన్ ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. 1974 నుంచి 1992 మధ్య జరిగే పీరియాడిక్ డ్రామాగా రూపొందుతున్న ఈ చిత్రంలో గ్రాఫిక్ వర్క్ హైలైట్ గా ఉంటుందని మేకర్స్ తెలుపుతున్నారు.