Adi Parvam: నాగలాపురం నాగమ్మగా మంచు లక్ష్మీ నట విశ్వరూపం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Adi Parvam: మంచు లక్ష్మీ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న చిత్రం ఆదిపర్వం. సంజీవ్ మేగోటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని రావుల వెంకటేశ్వర్ రావు సమర్పణలో అన్వికా ఆర్ట్స్ మరియు ఎ. వన్ ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. 1974 నుంచి 1992 మధ్య జరిగే పీరియాడిక్ డ్రామాగా రూపొందుతున్న ఈ చిత్రంలో గ్రాఫిక్ వర్క్ హైలైట్ గా ఉంటుందని మేకర్స్ తెలుపుతున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి మంచు లక్ష్మీ ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. నాగలాపురం నాగమ్మ మంచు లక్ష్మీ కనిపించనుంది. మోకాలి వరకు చీరను కట్టి.. నుదుటన పెద్ద బొట్టు పెట్టి పవర్ ఫుల్ గా కనిపించింది. ఇక ఈ పోస్టర్ లాంచ్ ఈవెంట్ లో దర్శకుడు మాట్లాడుతూ ..”అమ్మోరు, అరుంధతి చిత్రాల మాదిరిగా హై టెన్షన్ యాక్షన్ ఫిలింగా దక్షిణ భారతదేశంలోని అన్ని భాషలతోపాటు హిందీలో కూడా సిద్ధం అవుతోందని, ఇటీవల విడుదలయి సంచలన విజయాన్ని సొంతం చేసుకున్న హనుమాన్ చిత్రం లాగే ఈ సినిమా కూడా అద్భుతమైన సక్సెస్ సాధిస్తుందని నాగలాపురం నాగమ్మ గా మంచులక్ష్మి నటవిశ్వరూపం చూడవచ్చని దర్శకుడు సంజీవ్ మేగోటి చెప్పుకొచ్చాడు.
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ఘంటా శ్రీనివాస్ రావు మాట్లాడుతూ “ఈ చిత్రంలో మంచులక్ష్మి పాత్ర చాలా గొప్పగా ఉంటుందని మంచులక్ష్మితోపాటు ఆదిత్య ఓం, ఎస్తర్ నోరోనా, శ్రీజిత ఘోష్, వెంకట్ కిరణ్, సత్యప్రకాష్, సుహాసిని, హ్యారీజోష్, సమ్మెట గాంధీ, జెమినీ సురేష్, యోగికాత్రి, గడ్డం నవీన్, ఢిల్లీరాజేశ్వరి ఇలా చాలా మంచి నటీనటులు తమతమ పాత్రల్లో విజృంభించారని, ఎంతో ప్రతిష్టాత్మకంగా చేస్తున్న గ్రాఫిక్స్ వర్క్ చివరిదశకు చేరుకుందని ఒక మంచి ప్రాజెక్టుని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి మా దర్శకుడు సంజీవ్ మేగోటి అహర్నిశలు కష్టపడుతున్నారని, అలాగే చిత్రంలో నాగమ్మగా చేస్తున్న మంచులక్ష్మిగారు ఎంతో రిస్క్ చేసి రెండు అద్భుతమైన ఫైట్స్ చేశారని, ఆ రెండు ఫైట్స్ చిత్రానికి మరో హైలెట్ అని, క్షేత్ర పాలకుడిగా ప్రత్యేక పాత్ర చేస్తున్న శివకంఠంనేని కూడా అద్భుతంగా చేశారు” అని తెలిపారు. చిత్ర సహనిర్మాతల్లో ఒకరైన గోరెంట శ్రావణి ‘ఆదిపర్వం చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ దశలోనే చూసి చాలా హ్యాపీగా, గర్వంగా ఫీల్ అయ్యానని’ తన సంతోషాన్ని వెలిబుచ్చారు. “ఆదిపర్వం గ్రాఫిక్స్ ప్రాధాన్యతతో పాటు కసికొద్దీ పాత్రలో పరకాయప్రవేశం చేసి ఒప్పించి మెప్పించ గల నటి మంచులక్ష్మీ.. ఈ చిత్రాన్నికి మరో మంచి ఎస్సెట్” అని చిత్ర సమర్పకులు రావుల వెంకటేశ్వరరావు తెలిపాడు. మరి ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.
Also Read
తాజావార్తలు
-
Supreme Court: జ్ఞానేష్ కుమార్ సస్పెన్షన్‌పై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం.. కేంద్ర ఎన్నికల సంఘానికి నోటీసులు
-
Karimnagar Collectorate : కలెక్టరేట్లో బిగ్ షాక్.. తృటిలో తప్పిన ప్రమాదం.!
-
CM Chandrababu: రాయలసీమను రతనాల సీమగా మారుస్తాం..!
-
Vizag Navy Sailor : పాక్ హనీట్రాప్‌లో వైజాగ్ నేవీ సైలర్.. కోయంబత్తూరులో అరెస్ట్
-
Nirmala Sitharaman: “మరో సంక్షోభం ముంచుకొస్తోంది”.. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సంచలన హెచ్చరిక..!
ట్రెండింగ్
-
Local Body Elections: స్థానిక ఎన్నికలపై సుప్రీం కోర్టు తలుపు తట్టిన వైఎస్సార్సీపీ.. డిమాండ్ ఏంటంటే.?
-
5000 నిట్స్ డిస్‌ప్లే, 9,020mAh బ్యాటరీ, IP69 రేటింగ్‌తో Vivo Y600k Turbo లాంచ్..!
-
ఆఫర్లే ఆఫర్లు.. OnePlus Festive Sale వచ్చేసిందోచ్.. వాటిపై భారీ డిస్కౌంట్స్.!
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?