ఎన్టీఆర్ జిల్లా బీజేపీ అధ్యక్షుడుగా అడ్డురి శ్రీరామ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ విషయాన్ని బీజేపీ ఏపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు వేటుకూరి సూర్యనారాయణ రాజు ధ్రువీకరించారు. అధ్యక్ష పదవికి నలుగురు పోటీ పడగా.. పార్టీని బలోపేతం చేయటంలో శ్రీరామ్ పని తీరును పార్టీ గుర్తించింది. అంతేకాదు కార్యకర్తల అభిప్రాయాలను కూడా పార్టీ పెద్దలు పరిగణలోకి తీసుకున్నారు. అడ్డురి శ్రీరామ్ రాబోయే మూడు సంవత్సరాలు అధ్యక్ష పదవిలో కొనసాగుతారు. ‘బీజేపీ పార్టీ ప్రతి మూడు సంవత్సరాలకు ఓసారి సంస్థాగత ఎన్నికలు…