యన్టీఆర్ హీరోగా రూపొందిన ‘అడవిరాముడు’ ఘనవిజయంతో ఆ పై ఎంతోమంది అడవి నేపథ్యంలో చిత్రాలు తెరకెక్కించారు. టైటిల్స్ లోనూ ‘అడవి’ పేరును చొప్పించారు. అలా రూపొందిన చిత్రాలలో “అడవి దొంగ, అడవి సింహాలు” వంటివి జనాన్ని అలరించాయి. ఆ కోవలో వచ్చిన చిత్రమే ‘అడవి రాజా’. శోభన్ బాబు, రాధ జంటగా నటించిన ఈ చిత్రానికి కె.మురళీమోహనరావు దర్శకత్వం వహించారు. 1986 అక్టోబర్ 31న ‘అడవిరాజా’ విడుదలయింది. నటుడు కైకాల సత్య నారాయణ సమర్పణలో ఆయన సోదరుడు…