Adapaduchu: తెలుగు ప్రజల హృదయాల్లో 'అన్న'గా సుస్థిర స్థానం సంపాదించిన నటులు విశ్వవిఖ్యాత నటసార్వభౌమ యన్.టి. రామారావు. అనేక చిత్రాలలో తమ్ముళ్ళకు, చెల్లెళ్ళకు అన్నగా నటించి మెప్పించిన నటరత్న నటన మరపురానిది. ఆ తీరున ఆయన అభినయంతో అలరించిన చిత్రం 'ఆడపడుచు'. 1967 నవంబర్ 30న విడుదలైన 'ఆడపడుచు' జనాన్ని విశేషంగా అలరించింది.