తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. తన మంత్రివర్గ సహచరులతో పార్టీ ఎమ్మెల్యేలతో కలిసి ఇవాళ హైదరాబాద్ రాజ్ భవన్ ముందు ధర్నా చేయడం విడ్డూరంగా ఉందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. రేవంత్ రెడ్డి వ్యవహారం గురివింద గింజ సామెతను తలపిస్తోందని.. అదానీ అంశంపై మాట్లాడే నైతిక హక్కు రేవంత్ రెడ్డికి లేదని విమర్శించారు.
అదానీ అంశంపై అసెంబ్లీలో చర్చ పెట్టాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్‌రావు డిమాండ్ చేశారు. రేవంత్ రెడ్డి సర్కస్ ఫీట్లు చూసి ఊసరవెల్లి సిగ్గుపడుతుందని.. ఢిల్లీలో దోస్తీ, గల్లీలో కుస్తీ చేస్తున్నారని ఆయన తీవ్రంగా విమర్శించారు. రాజ్‌భవన్ ముట్టడిలో కేసీఆర్ గురించి రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారని.. మేము రేవంత్ రెడ్డి, అదానీ ఫోటోతో అసెంబ్లీకి వస్తే మమ్మల్ని అడ్డుకున్నారన్నారు.
ఈ నెల 18న టీపీసీసీ ఆధ్వర్యంలో చలో రాజ్‌భవన్ కార్యక్రమం నిర్వహించాలని కాంగ్రెస్ నిర్ణయించింది. ఈ నెల 18వ తేదీ బుధవారం నాడు ఉదయం 11 గంటలకు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో చలో రాజ్ భవన్ కార్యక్రమం నిర్వహించనున్నారు.
స్కిల్ యూనివర్సిటీకి అదానీ ఇస్తానన్న వంద కోట్లను తెలంగాణ ప్రభుత్వం స్వీకరించడానికి సిద్ధంగా లేదని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. టెండర్లు.. నిబంధనల మేరకు నిర్వహిస్తారని, ఎవరు టెండర్లలో రాణిస్తే వాళ్లకు ఇస్తారన్నారు.
మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత ధనికుడు.. పేదలు మధ్య వ్యత్యాసం పెరిగిపోతుందని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆరోపించారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మోడీ వల్లనే అదానీ దురాగతాలకు పాల్పడుతున్నారని ఆయన మండిపడ్డారు.
Bhatti Vikramarka : డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క కేంద్రంలోని బీజేపీ పెద్దలపై తీవ్ర విమర్శలు చేశారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ, ప్రభుత్వ రంగ సంస్థలు , దేశ సంపదను అదానీకి అప్పగిస్తున్నారని ఆరోపించారు. రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ నేతలు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రభుత్వం పరిశ్రమల ఏర్పాటుకు కేవలం నిబంధనల మేరకు ఒప్పందాలు చేసుకుంటుందని, పారిశ్రామికవేత్తలు రాష్ట్రానికి రావడానికి ఎలాంటి ఆంక్షలు లేవని స్పష్టం చేశారు. Zomato: జీతం…