ఇప్పుడు ఎవరైనా తెలుగు ఇంగ్లిష్ మిళితం చేసి మాట్లాడితే ‘టింగ్లిష్’ అంటున్నారు. అలాంటి మాటలు అమెరికాలో ఏ నాటి నుంచో హల్ చల్ చేస్తున్నాయి. రెండు మూడు భాషలను మిళితం చేసి మాట్లాడితే నవ్వుల పువ్వులూ పూస్తూ ఉంటాయి. కొందరు భాషాపండితులు ‘శభాష్’ అనీ అనవచ్చు. 2004లో ‘స్పాంగ్లిష్’అనే రొమాంటిక్ కామెడీ వచ్చింది. స్పానిష్, ఇంగ్లిష్ కలిపి మాట్లాడుతూ కితకితలు పెట్టించిందీ సినిమా. ఇందులో కథానాయకునిగా నటించిన ఆడమ్ శాండ్లర్ ను చూడగానే ఇప్పటికీ గిలిగింతలు కలిగి…