కొందరిని చూడగానే మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తుంది. అంతటి అందం సొంతం చేసుకున్నవారిలో కళలు నెలకొని ఉంటే మరింతగా చూసి మురిసిపోతాము. ఆ కళల్లోనూ కరగని వైభవం ఉందంటే, అభిమానంతో కరిగిపోతూ, ఆ కళల నిలయాన్ని ఆరాధిస్తూ ఉంటాము. రాతి గుండెల్లో సైతం కళాభిరుచి కలిగించగల నిపుణులు కొందరు ఉంటారు. అలాంటి వారిలో సుప్రసిద్ధ నటి, నర్తకి వైజయంతీమాల అగ్రస్థానంలో నిలుచుంటారు. ఓ నాటి తమిళ అందాలతార వసుంధరాదేవి కుమార్తె వైజయంతీ మాల. 1943లో రంజన్ హీరోగా రూపొందిన…