తెలుగు సినిమాలతోనే వెలుగు చూసిన శ్రియా శరణ్ నటిగా 20 ఏళ్ళు పూర్తి చేసుకుంది. తొలిసారి శ్రియ తెరపై కనిపించిన ‘ఇష్టం’ చిత్రం విడుదలై ఇరవై ఏళ్ళవుతోంది. ఉషాకిరణ్ మూవీస్ నిర్మించిన ‘ఇష్టం’ ఆట్టే ఆకట్టుకోలేకపోయింది. అయినా శ్రియ అందం రసికులకు శ్రీగంధం పూసింది. దాంతో దర్శకుడు దశరథ్ తన తొలి ప్రయత్నంగా తెరకెక్కించిన ‘సంతోషం’లో శ్రియ అందానికి తగిన పాత్రనిచ్చారు. ‘ఇష్టం’ శ్రియకు అయిష్టం కలిగించినా, రెండవ చిత్రం ‘సంతోషం’ టైటిల్ కు తగ్గట్టుగానే సంతోషం…