తెలుగమ్మాయి అంజలి ‘వకీల్ సాబ్’తో నిలదొక్కుకున్నట్లేనా!? గతంలో ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’తో ఓ వేవ్ లా టాలీవుడ్ ని తాకింది అంజలి. అంతకు ముందు చిన్న చిన్న సినిమాల్లో నటించినా… ఆ సినిమా ఒక్కసారిగా స్టార్ స్టేటస్ తెచ్చిపెట్టింది. అప్పటికే తమిళనాట కూడా స్టార్ గా గుర్తింపు తెచ్చుకుంది అంజలి. అయితే వ్యక్తిగత జీవితంలో ఒడిదుడుకులతో కెరీర్ ని సక్సెస్ ఫుల్ గా కొనసాగించలేక పోయింది. మధ్యలో కొన్ని సినిమాల్లో మెరిసినా మునుపటి ఫామ్ అందిపుచ్చుకోలేక…