(అక్టోబర్ 1న శివాజీ గణేశన్ జయంతి) అనేక విలక్షణమైన పాత్రలకు ప్రాణం పోసి, జనాన్ని విశేషంగా ఆకట్టుకున్న నటులు శివాజీ గణేశన్. తమిళనాట శివాజీ అభినయం భావితరాల వారికి పెద్దబాలశిక్షగా నిలచిందంటే అతిశయోక్తి కాదు. కమల్ హాసన్, శివకుమార్, జైశంకర్, విక్రమ్, సూర్య వంటి వారు తమకు శివాజీ గణేశన్ నటనే ఆదర్శం అంటూ పలుమార్లు నొక్కివక్కాణించారు. నేడు జనం చేత ‘ఉలగనాయగన్’ గా జేజేలు అందుకుంటున్న కమల్ హాసన్ “శివాజీగారి నటనలో పది శాతం చేయగలిగినా…