“బొమ్మాళీ… నిన్నొదల…” అంటూ గళంతో జనాన్ని జడిపించి, ప్రతినాయక పాత్రలలోనూ భయపెడుతూ సాగుతున్నారు పూడిపెద్ది రవిశంకర్. వారి కుటుంబం మొత్తం గాత్రాన్ని నమ్ముకొని చిత్రసీమలో నిలదొక్కుకున్నారంటే అతిశయోక్తి కాదు. ఆయన తండ్రి పి.జె.శర్మ వందల చిత్రాలలో నటించారు. అనేక సినిమాల్లో పరభాషా నటులకు గాత్రదానం చేశారు. తండ్రి బాటలోనే పయనిస్తూ రవిశంకర్ అన్న సాయికుమార్ సాగారు. సాయికుమార్ గళంతో సుమన్, రాజశేఖర్ వంటి హీరోలు స్టార్స్ గా చెలామణీ అయ్యారు. అప్పట్లో సాయికుమార్ వాయిస్ ఉందంటే చాలు…