తండ్రి అడుగుజాడల్లో తనయులు పయనించడం చిత్రసీమలో పరిపాటి అయిపోయింది. ముఖ్యంగా నటుల వారసులు నటనవైపే మొగ్గు చూపుతున్నారు. ఆ మాటకొస్తే నిర్మాతలు, దర్శకులు, సాంకేతికనిపుణుల వారసులు కూడా నటనపైనే మోజు పెంచుకుంటున్నారు. ఇక నటవిరాట్ గా జనం మదిలో నిలచిన రావు గోపాలరావు తనయుడు రావు రమేశ్ సైతం నాన్న బాటలో పయనించి, జేజేలు అందుకుంటున్నాడు. వాచకాభినయంలో భళా అనిపించిన రావు గోపాలరావు తనయునిగా రావు రమేశ్ కూడా తనదైన డైలాగ్ యాక్సెంట్ తో జనాన్ని ఇట్టే…