కోలీవుడ్ స్టార్ హీరో సూర్య ప్రజంట్ హిట్ ఫట్ తో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేస్తూ పోతున్నారు. ఇటీవల ‘కంగువ’ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సూర్య ఆశించిన ఫలితాలను దక్కించుకోలేక పోయ్యాడు. దాదాపు 10 కి పైగా భాషల్లో 3డి టెక్నాలజీతో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. కానీ ఫలితం మాత్రం దక్కలేదు. ఇక ప్రస్తుతం కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో ‘రెట్రో’ సినిమా చేస్తున్నాడు. అలాగే ఆర్జే బాలాజీ దర్శకత్వంలో సూర్య 45 సినిమాలోనూ నటిస్తున్నారు.…