(ఆగస్టు 15న అర్జున్ జన్మదినోత్సవం) పోరాట సన్నివేశాల్లో తనదైన బాణీ పలికిస్తూ ‘యాక్షన్ కింగ్’ అనిపించుకున్నారు అర్జున్ సర్జా. ఆయన కుటుంబ సభ్యుల్లో చాలామంది సినిమా రంగానికి చెందినవారే. నటునిగా, దర్శకునిగా, నిర్మాతగా సాగుతున్న అర్జున్ స్వాతంత్ర్య దినోత్సవాన జన్మించడం వల్ల తనలో దేశభక్తిని నింపుకొనీ చిత్రాలను రూపొందించారు. ఆయన చేతిపై మన మువ్వన్నెల జెండా పచ్చబొట్టు కూడా కనిపిస్తుంది. తెలుగునాట ‘మా పల్లెలో గోపాలుడు’గా అవతరించకముందే కొన్ని కన్నడ అనువాద చిత్రాల ద్వారా అర్జున్ తెలుగువారికి…