ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో ప్రతి ఏటా జరిగే జాతీయ క్రీడా పురస్కారాల ప్రదానోత్సవం బుధవారం ఘనంగా జరిగింది. ప్రతిభ కనబర్చిన క్రీడాకారులకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రతిష్టాత్మక అవార్డులను బహుకరించారు. క్రీడల్లో అత్యున్నత పురస్కారమైన ధ్యాన్‌చంద్ ఖేల్ రత్న అవార్డును టేబుల్ టెన్నిస్ లెజెండ్ అచంట శరత్ కమల్ అందుకోగా.. అర్జున అవార్డును 25 మంది క్రీడాకారులు స్వీకరించారు.