మహారాష్ట్రలో నవంబర్ 20న అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. భారీగా ఓటింగ్ శాతం పెంచేందుకు ఎన్నికల సంఘం కసరత్తు చేస్తోంది. ఇప్పటికే ఆయా సంస్థలకు ఈసీ కీలక ఆదేశాలు జారీ చేసింది. నవంబర్ 20న సెలవు ఇవ్వాలంటూ ఆదేశాలు ఇచ్చింది. దీంతో ఇప్పటికే ఆయా సంస్థలు వేతనంతో కూడిన సెలవును ప్రకటించాయి.