ముహర్రం ఊరేగింపులో అపశ్రుతి చోటుచేసుకుంది. జార్ఖండ్‌లోని బొకారోలో శనివారం ముహర్రం ఊరేగింపు నిర్వహిస్తుండగా.. విద్యుదాఘాతానికి గురై నలుగురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోగా.. మరో 13 మంది గాయాల పాలయ్యారు.
ఇండోనేషియాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. సులవేసి ద్వీపంలో ప్రమాదవశాత్తు పడవ మునిగి 15 మంది మృతి చెందారు. మరికొందరు గల్లంతైనట్లు అక్కడి అధికారులు చెబుతున్నారు. మొత్తం ఆ పడవలో 40 మంది ప్రయాణికులు ప్రయాణిస్తున్నారు. అందులో 19 మంది గల్లంతయ్యారనీ, ఆరుగురు ప్రాణాలతో బయటపడ్డారని ఏజెన్సీ ఒక ప్రకటనలో తెలిపింది.
బంగ్లాదేశ్‌లో ఘోర బస్సు ప్రమాదం జరిగింది. ఝలకతి సదర్ ఉపజిల్లాలోని ఛత్రకాండ ప్రాంతంలో శనివారం బస్సు రోడ్డు పక్కన ఉన్న చెరువులో పడింది. ఈ ప్రమాదంలో 17 మంది మృతి చెందగా.. 35 మందికి పైగా గాయపడ్డారు.
Post Office: తపాలా శాఖ ఎప్పటికప్పుడు తన కస్టమర్ల కోసం నూతన పథకాలు రూపొందిస్తుంది. అలాగే తాజాగా తపాలా శాఖ వినూత్న రీతిలో టాటా ఏఐజి ఇన్సూరెన్స్ సంస్థ ఆధ్వర్యంలో పేద, బడుగు, బలహీన వర్గాలకు అందుబాటులో ఉండే విధంగా గ్రూప్ యాక్సిడెంట్ కార్డు పాలసీని రూ.399 కే అందుబాటులోకి తెచ్చిందని,ఈ పాలసీ ద్వారా ఎలాంటి ప్రమాదం సంభవించినా బీమా తీసుకున్నప్పటి నుంచి ఏడాది పాటు రూ.10 లక్షల బీమా కవరేజీ వర్తిస్తుంది.
హైదరాబాద్ శివార్లలోని సన్ సిటీ సమీపంలో మంగళవారం జరిగిన ఈ ఘటన చాలా దురదృష్టకరమని సీనియర్ ఐపీఎస్ అధికారి, టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఆవేదన వ్యక్తం చేశారు.
ఒడిషాలో జరిగిన ఘోర రైలు ప్రమాదంలో నెల రోజుల తరువాత రైల్వే శాఖలో ఉన్నతాధికారిపై వేటు వేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. భారతీయ రైల్వే చరిత్రలోఅత్యంత ఘోరప్రమాదాల్లో ఒడిశాలోని బహనాగ మూడు రైళ్ల ప్రమాదం ఒకటి.