సిర్ఫ్ దస్ దిన్ మే మిలేంగే సూర్య భాయ్…
ఆగస్టు 9న సూపర్ స్టార్ మహేష్ బాబు బర్త్ డే కావడంతో ఘట్టమనేని ఫాన్స్ అంతా సెలబ్రేషన్ మోడ్ లో ఉన్నారు. గ్రాండ్ సెలబ్రేషన్స్ చేయడానికి ప్రిపేర్ అవుతూ మహేష్ ఫాన్స్ ఆన్ లైన్-ఆఫ్ లైన్ అనే తేడా లేకుండా హంగామా చేస్తున్నారు. మహేష్ ఫాన్స్ హ్యాపీనెస్ ని మరింత పెంచుతోంది ‘బిజినెస్ మాన్’ సినిమా. తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న ఐకానిక్ క్యారెక్టర్స్ లో సూర్య భాయ్ ఒకటి. మహేష్ బాబు నటించిన సినిమాల్లో ఘట్టమనేని అభిమానులకి మాత్రమే కాకుండా మొత్తం సినీ అభిమానులందరికి నచ్చిన సినిమా ‘బిజినెస్ మాన్’. మహేశ్ బాబు నటించిన 27 సినిమాల్లో, ఇన్నేళ్ల తెలుగు సినిమా ప్రయాణంలో పూరి జగన్నాధ్ రాసిన ‘బిజినెస్ మాన్’ లాంటి సినిమా ఇంకొకటి లేదు, రాలేదు, ఇకపై కూడా రాదేమో. ఈ మూవీలో గ్యాంగ్ స్టర్ మహేశ్ చేసిన పెర్ఫార్మెన్స్ ఇంటెన్స్ గా ఉంటుంది. ‘సూర్య భాయ్’ ఒక డ్రగ్ లా మూవీ లవర్స్ ని మాయ చేసాడు. పదమూడేళ్ల క్రితం రిలీజ్ అయినా ఇప్పటికే ఫ్యాన్స్ కి కిక్ ఇస్తూనే ఉంది బిజినెస్ మాన్ సినిమా.
చంద్రబాబు కుట్రలను తిప్పికొట్టాలి.. జగన్‌ను మళ్లీ సీఎం చేయాలి
గుంటూరు మిర్చి యార్డులో నూతన పాలక వర్గం ప్రమాణ స్వీకారం చేసింది. ఈ కార్యక్రమానికి మంత్రులు కారుమూరి నాగేశ్వరరావు, అంబటి రాంబాబు, ఎంపీ శ్రీకృష్ణ దేవరాయులతో పాటు పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి కారుమూరి నాగేశ్వరరావు మాట్లాడుతూ.. ఆసియాలో అతి పెద్దదైన మిర్చి యార్డు చైర్మన్ పదవి మంత్రి పదవి కంటే పెద్దదని పేర్కొన్నారు. అలాంటి పదవిని సీఎం జగన్ బీసీలకు కేటాయించారన్నారు. గతంలో చంద్రబాబు కలెక్టర్ల మీటింగ్‌లో మా కులం వాళ్ళకు పని చేయమని ఆదేశాలు ఇచ్చేవాడని.. కానీ జగన్ మాత్రం ఎస్సీ, బీజీలతో పాటు ఆర్థికంగా వెనుకబడిన వారికి మేలు చేయాలని ప్రయత్నిస్తున్నారని పేర్కొన్నారు.
నిన్నటితో పోలిస్తే కాస్త తగ్గిన గోదావరికి వరద..
ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని భద్రాచలం వద్ద గోదావరి 54.7 అడుగులకు చేరుకుంది. నిన్నటితో పోలిస్తే గోదావరికి వరద కొద్దిగా తగ్గింది. మూడో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. ఎగువ నుంచి వర్షాలు తగ్గుముఖం పట్టడంతో గోదావరికి వరద తగ్గింది. శనివారం రాత్రికి గోదావరి 56.9 అడుగులకు చేరుకుంది. అయితే ఈ మధ్యాహ్నానికి గోదావరికి వరద కొద్దిగా తగ్గిందని అధికారులు చెబుతున్నారు. అయితే మళ్లీ వర్షాలు కురిస్తే ఇబ్బందులు తప్పవనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. భద్రాచలం ఆలయంలోని స్నానఘట్టం ఇంకా వరద నీటిలోనే ఉంది. గోదావరి, ఇతర నదులతో పాటు రోడ్లన్నీ నీట మునిగాయి. దీంతో దుమ్ముగూడెం, చర్ల, వాజేడు, వెంకటాపురం తదితర మండలాలకు రాకపోకలు నిలిచిపోయాయి.
మా బిల్డింగ్ గురించి మా ప్రెసిడెంట్ ను అడగండి.. నన్ను కాదు
టాలీవుడ్‌లో అత్యంత ప్రతిష్టాత్మకమైన తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ (టీఎఫ్‌సీసీ)ఎన్నికలు ప్రారంభమయిన విషయం తెల్సిందే. ఈసారి స్టార్ నిర్మాత దిల్ రాజ్ ప్యానెల్ వర్సెస్ సి కళ్యాణ్ ప్యానల్ పోటీపడుతున్నారు. ఇక ఉదయం నుంచి ఓటు హక్కు కలిగి ఉన్న నిర్మాతలు పెద్ద ఎత్తున ఫిల్మ్ చాంబర్‌కు తరలి వచ్చి ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఇక అధ్యక్ష బరిలో నిలిచిన దిల్ రాజు, సి. కల్యాణ్ ఫిల్మ్ చాంబర్‌కు చేరుకొని పోలింగ్‌ని పరిశీలిస్తున్నారు. మధ్యాహ్నం 3 గంటల వరకు పోలింగ్ జరగనుండగా.. సాయంత్రం 6 గంటలకు ఫలితాలను వెల్లడించనున్నారు. ఇక ఈ నేపథ్యంలోనే సీనియర్ నటుడు నరేష్ మాట్లాడుతూ.. “సినిమా ఇండస్ట్రీ గ్లామర్ ఫీల్డ్ కాబట్టి ఇక్కడ జరిగే ఏ ఎన్నికలైనా కోలాహలంగా ఉంటాయి.అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లా ఉంటాయి. ఇండస్ట్రీలో నిర్మాత బాగుండాలి. నిర్మాత బాగుంటేనే అందరూ బాగుంటారు. ఇక మా బిల్డింగ్ గురించి మా ప్రెసిడెంట్ ను అడగండి.. నన్ను కాదు. దాని గురించి ఆయన చెప్తేనే బావుంటుంది. జనరల్ బాడీలో రిసొల్యూషన్ పాస్ అయ్యింది. దాని గురించి నాకంటే కూడా మా ప్రెసిడెంట్ మంచు విష్ణు చెప్తేనే బావుంటుంది.
మా బిల్డింగ్ గురించి మా ప్రెసిడెంట్ ను అడగండి.. నన్ను కాదు
టాలీవుడ్‌లో అత్యంత ప్రతిష్టాత్మకమైన తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ (టీఎఫ్‌సీసీ)ఎన్నికలు ప్రారంభమయిన విషయం తెల్సిందే. ఈసారి స్టార్ నిర్మాత దిల్ రాజ్ ప్యానెల్ వర్సెస్ సి కళ్యాణ్ ప్యానల్ పోటీపడుతున్నారు. ఇక ఉదయం నుంచి ఓటు హక్కు కలిగి ఉన్న నిర్మాతలు పెద్ద ఎత్తున ఫిల్మ్ చాంబర్‌కు తరలి వచ్చి ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఇక అధ్యక్ష బరిలో నిలిచిన దిల్ రాజు, సి. కల్యాణ్ ఫిల్మ్ చాంబర్‌కు చేరుకొని పోలింగ్‌ని పరిశీలిస్తున్నారు. మధ్యాహ్నం 3 గంటల వరకు పోలింగ్ జరగనుండగా.. సాయంత్రం 6 గంటలకు ఫలితాలను వెల్లడించనున్నారు. ఇక ఈ నేపథ్యంలోనే సీనియర్ నటుడు నరేష్ మాట్లాడుతూ.. “సినిమా ఇండస్ట్రీ గ్లామర్ ఫీల్డ్ కాబట్టి ఇక్కడ జరిగే ఏ ఎన్నికలైనా కోలాహలంగా ఉంటాయి.అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లా ఉంటాయి. ఇండస్ట్రీలో నిర్మాత బాగుండాలి. నిర్మాత బాగుంటేనే అందరూ బాగుంటారు. ఇక మా బిల్డింగ్ గురించి మా ప్రెసిడెంట్ ను అడగండి.. నన్ను కాదు. దాని గురించి ఆయన చెప్తేనే బావుంటుంది. జనరల్ బాడీలో రిసొల్యూషన్ పాస్ అయ్యింది. దాని గురించి నాకంటే కూడా మా ప్రెసిడెంట్ మంచు విష్ణు చెప్తేనే బావుంటుంది.
మృతుల కుటుంబాలకు ఇచ్చే రూ.4లక్షల్లో.. 3 లక్షలు కేంద్రానివే
వరంగల్ జిల్లా మొరంచపల్లిలో వర్షం వరదలు సృష్టించిన బీభత్సాన్ని కేంద్ర మంత్రి బిజేపి రాష్ట్ర అద్యక్షులు కిషన్ రెడ్డి పరిశీలించారు. బాధితులను పరామర్శించి భాదలను విన్నారు. అధిక వర్షాల వల్ల వరదలతో అనేక గ్రామాలు నీటమునిగాయని అన్నారు. ఇళ్ళు రోడ్లు దెబ్బతిన్నాయని తెలిపారు. పంటపొలాలు వరదలో కొట్టుకుపోయాయని బాధితులు వాపోయారు. కేంద్ర ప్రభుత్వం కూడా అన్ని విధాల ఆదుకుంటామని కిషన్ రెడ్డి తెలిపారు. జాతీయ విపత్తు క్రింద 800 నుంచి 900 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం వద్ద ఉన్నాయని తెలిపారు. వాటితో బాధితులను అన్ని విధాల ఆదుకోవాలని అన్నారు. మృతులకు 4 లక్షల ఇచ్చే ఎక్సిగ్రేషియా లో 75 శాతం 3 లక్షలు కేంద్రం ఇచ్చినవే అని తెలిపారు. దానికి అదనంగా రాష్ట్రప్రభుత్వం ఇవ్వాలని కోరారు.
ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డిని పరామర్శించిన ఎమ్మెల్సీ కవిత
సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డిని ఎమ్మెల్సీ కవిత పరామర్శించారు. ఈ నెల 27న గుండెపోటుతో కాంటి నెంటల్ ఆస్పత్రిలో మహిపాల్‌రెడ్డి కుమారుడు గూడెం విష్ణువర్ధన్ రెడ్డి మృతిచెందారు. విష్ణువర్ధన్ రెడ్డి మరణం అత్యంత బాధాకరమని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అతి పిన్న వయసులో తండ్రికి తగ్గ తనయుడిగా రాజకీయాల్లో ఎదుగుతున్న గూడెం విష్ణువర్ధన్ రెడ్డి అకాల మరణం అత్యంత బాధాకరమని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డికి పుత్రశోకం కలగడం తనను దిగ్భ్రాంతిని గురిచేసిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
బీజేపీలో చేరిన 300 మంది యువతీ యువకులు
జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో అన్ని డివిజన్ లలో నుండి యువత ముందుకు వచ్చి బీజేపీ లో చేరడం హర్షణీయం అన్నారు హైదరాబాద్ బీజేపీ జిల్లా అధ్యక్షుడు గౌతమ్ రావు. యూసుఫ్ గూడ లోని ఒక ప్రైవేట్ ఫంక్షన్ హాల్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమం లో ఆయన సమక్షంలో 300 మందికి పైగా యువతీ యువకులను ఆయన బీజేపీ కండువా కప్పి పార్టీ లోకి ఆహ్వానించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ నరేంద్ర మోడీ ని మూడోసారి ప్రధాన మంత్రి గా చూడాలని యువత బలంగా కోరుకుంటున్నట్లు, రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన ఏ ఒక్క వాగ్దానాలను నిలబెట్టుకోలేక పోయిందని అన్నారు. స్థానిక ఎమ్మెల్యే కూడా సమస్యలను పట్టించుకోవట్లేదని, పోలీస్ వ్యవస్థ ను పెట్టుకొని దుర్మార్గమైన పాలన నడిపిస్తున్నారని,అన్ని డివిజన్ లలో రోడ్లు, డ్రైనేజీ అతలాకుతలం అయ్యాయని, జూబ్లీహిల్స్ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని ఈ చేరికలు అందుకు సాక్ష్యంగా నిలుస్తాయని అన్నారు.
ఆగస్ట్ నెలలో ఈ రోజుల్లో బ్యాంకులకు వెళ్లకండి..
బ్యాంక్ హాలిడే ఆగస్టు ప్రతి రాష్ట్రంలోనూ ప్రతి నెలా కొన్ని రోజులు బ్యాంకులు మూసి ఉంటాయి. ఆగస్టు నెలలో అనేక పండుగలు రానున్నాయి. దీంతో వచ్చే నెల 15 రోజుల పాటు బ్యాంకులు మూతపడనున్నాయి. ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకుల సెలవులను సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మాత్రమే నిర్ణయిస్తుంది. సంవత్సరం ప్రారంభంలో RBI సెలవుల క్యాలెండర్‌ను విడుదల చేస్తుంది.
ఆగస్ట్ 2023 అంటే వచ్చే నెల ప్రారంభం కావడానికి కొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. బ్యాంకుకు సంబంధించిన ముఖ్యమైన పనిని నిర్వహించుకోవాలని అనుకుంటే మీ బ్యాంక్ సెలవుల జాబితాను ముందుగానే తెలుసుకోవడం చాలా ముఖ్యం. దీనితో బ్యాంకులో మీ పనిని పూర్తి చేయడంలో సమస్యలు ఎదురుకావు.
హైదరాబాద్‌లో విషాదం..నిముషాల వ్యవధిలోనే మూడు ప్రమాదాలు,5 మంది మృతి..
హైదరాబాద్ లో ఆదివారం విషాదం చోటు చేసుకుంది.. ఒకేసారి పలు చోట్ల ప్రమాదాలు జరిగాయి.. కేవలం గంటల వ్యవధిలోనే ఈ ప్రమాదాలు చోటు చేసుకున్నాయి.. ఈ రోజు ఉదయం పూట కేవలం మూడు గంటల వ్యవధిలోనే మూడు రోడ్డు ప్రమాదాలు జరగడం కలకలం రేపింది.. ఈ మూడు రోడ్డు ప్రమాదాల్లో ఐదుగురు మృతి చెందారు. ఉదయం ట్యాంక్‌బండ్‌పై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఎవరికి ప్రమాదం జరగలేదు. కానీ కారు మాత్రం పూర్తిగా దెబ్బతింది.. అయితే కారులో ఉన్న సెఫ్టీ బెలూన్స్ తెరుచుకోవడం వల్లే అందులో ఉన్నవారికి ఎలాంటి ప్రమాదం జరగలేదు. ఆ తర్వాత వారు కారు దిగి వెళ్లిపోయారు. ఈ ఘటన పై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. కారు అతివేగంగా నడపడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు అంచనా వేస్తున్నారు..
ఇకపోతే రంగారెడ్డి జిల్లాలోని ఆరాంఘర్ వద్ద ఓ బైక్ అదుపుతప్పి విద్యుత్ స్థంభాన్ని ఢీకొంది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. అలాగే కుషాయిగూడలోని ఓ కారు డివైడర్‌ను ఢీకొంది. ఈ ప్రమాదంలో కూడా ముగ్గురు మరణించారు. అయితే ఈ ప్రమాదాలు వాహనాలు వేగంగా నడపడమే కారణమే పోలీసులు భావిస్తున్నారు.. అయితే స్పాట్ లోనే వారందరు చనిపోయారు…
హైదరాబాద్‌లో చాలా చెరువులు కబ్జాకు గురయ్యాయి
నిజాలు చెప్పడానికి ప్రతిపక్షం కావాలి అబద్దాలు దాచానికి అధికార పక్షం కావాలి అనే విధంగా దాసోజు శ్రవణ్ వ్యాఖ్యలు చేస్తున్నాడని మండిపడ్డారు గ్రేటర్ హైదరాబాద్ కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ దర్పల్లి రాజశేఖర్ రెడ్డి. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గత వారం రోజులుగా ప్రజలు పడే ఇబ్బందులు గుర్తించి జీహెచ్‌ఎంసీని కోరడం తప్పా దాసోజు శ్రవణ్ చెప్పాలన్నారు. హైదరాబాద్ లో కేవలం 6 శాతం మాత్రమే వర్షాలు కురిసాయని, వర్షాల కారణంగా వచ్చే ఇబ్బందుల నుండి ప్రజలను కాపాడమని కోరినందుకు రేవంత్ రెడ్డి పై వ్యాఖ్యలు చేస్తున్నారా అని ఆయన అన్నారు.
గత వారం రోజులుగా తెలంగాణ లోని వివిధ జిల్లాల్లో 65 శాతం వర్షాలు పడ్డాయి.. అదే వర్షం హైదరాబాద్ లో పడితే హైదరాబాద్ సముద్రం లా మారేదని ఆయన వ్యాఖ్యానించారు. అంతేకాకుండా.. హైదరాబాద్ చాలా వరకు చెరువులు కబ్జాకు గురయ్యాయని, 2014 కు ముందు చెరువుల పరిస్థితికి నేటికి జరిగిన మార్పులపై చర్చలకు రండి అని ఆయన సవాల్ విసిరారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక చెరువులు కబ్జాకు గురైన విషయాన్నే రేవంత్ రెడ్డి తెలిపారు. కాదని చెప్పేందుకు మీరు మీ ప్రభుత్వం సిద్ధంగా ఉందా అని ఆయన అన్నారు. మూసి నదిలో గడ్డి తొలగింపు పేరు మీద లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టారని, దాసోజు శ్రవణ్ పార్టీలు మారినట్టు చెరువుల ఆక్రమణలకు సంబంధిచిన లెక్కలు మారవు గుర్తు పెట్టుకోవాలన్నారు రాజశేఖర్ రెడ్డి.
ఇంట్లో ఆడపిల్ల పుడితే రూ.21 వేలు ప్రకటించిన ప్రభుత్వం
ప్రభుత్వం పేద కుటుంబాల్లో జన్మించే ఆడపిల్లల సంరక్షణకు అనేక ప్రభుత్వ పథకాలను తీసుకొస్తుంది. దీని కింద ఆర్థిక సహాయం అందించబడుతుంది. ప్రభుత్వం ఆడపిల్ల పుట్టినప్పుడు 21 వేల రూపాయలు ఇస్తుంది. ఈ పథకం ప్రయోజనాన్ని ఎవరు పొందవచ్చో తెలుసుకుందాం… ఈ పథకం హర్యానా ప్రభుత్వం తీసుకొచ్చింది. ఇది 2015లో ప్రారంభించబడింది. ఈ పథకం పేరు ‘ఆప్కీ బేటీ, హమారీ బేటీ యోజన’. ఈ పథకం లక్ష్యం భ్రూణహత్యలను నిరోధించడం, అమ్మాయి..అబ్బాయి మధ్య నిష్పత్తిని తగ్గించడం. హర్యానా ప్రభుత్వం ఆప్కీ బేటీ హమారీ బేటీ యోజన రాష్ట్ర మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ ద్వారా నిర్వహించబడుతుంది.
మీరు ఈ మొత్తాన్ని ఎప్పుడు పొందుతారు
హర్యానా ప్రభుత్వం ఈ పథకం కింద షెడ్యూల్డ్ కులం లేదా BPL కుటుంబాల్లోని మొదటి ఆడపిల్ల.. ఏదైనా కులానికి చెందిన రెండవ ఆడపిల్ల కోసం LICలో రూ.21000 పెట్టుబడి పెట్టబడుతుంది. కుమార్తెకు 18 ఏళ్లు నిండినప్పుడు ఈ మొత్తాన్ని విత్‌డ్రా చేసుకోవచ్చు.
గోవాలో భారీగా డ్రగ్స్ పట్టివేత.. 5.2 కేజీల హెరాయిన్ సీజ్
గోవా విమానాశ్రయంలో భారీగా డ్రగ్స్ ను పట్టుకున్నారు DRI అధికారులు. 12 కోట్ల విలువ చేసే 5.2 కేజీల హెరాయిన్ సీజ్ చేశారు. ఓ ప్రయాణికురాలు ఇథియోపియా నుండి హెరాయిన్ తీసుకొస్తుండగా గోవాలో పట్టుకున్నారు. అయితే గోవా ఎయిర్ పోర్ట్ లో కస్టమ్స్ అధికారులు తనిఖీలు నిర్వహిస్తుండగా.. వారి కళ్లు గప్పి ట్రాలీ బ్యాగ్ లో డ్రగ్స్ తీసుకొని బయటకు వచ్చింది కిలాడీ లేడి. కస్టమ్స్ అధికారులకు ఏమాత్రం అనుమానం రాకుండా హెరాయిన్ ను ట్రాలీ బ్యాగ్ కింద భాగంలో దాచి తరలించే యత్నం చేసింది లేడి కిలాడీ.
ఫిల్మ్ ఛాంబర్ ఎన్నికలు జనరల్ ఎన్నికల్లా జరుగుతున్నాయి
తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఎన్నికల పోలింగ్ నేడు జరిగింది. అయితే.. ఈ ఎన్నికల్లో ఓటు వేసేందుకు పీపుల్ స్టార్ ఆర్. నారాయణమూర్తి వచ్చారు. ఆయన తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఫిల్మ్ ఛాంబర్ ఎన్నికలు జనరల్ ఎన్నికల్లా జరుగుతున్నాయని వ్యాఖ్యానించారు. నేను సి.కల్యాణ్ ప్యానెల్ అని, చాలా శాతం ఓటింగ్ కంప్లీట్ అయ్యిందన్నారు. ఏ ప్యానల్ గెలిచినా 80 శాతం నిర్మాతలకు ఉన్న కష్టాలను తీర్చాలన్నారు.
సినిమా కనెక్టాయితే.. ఎవరు ఆపలేరని, కానీ చాలా మంది లాస్ అవుతున్నారన్నారు. థియేటర్స్ మార్నింగ్ షో సమస్యలను తీర్చాలని, క్యూబ్ వల్ల లాస్ అవుతున్నామన్నారు. ఇక్కడ రేట్లు ఎక్కువ ఉన్నాయని, ఆ డిమాండ్ నెరవేర్చాలన్నారు. పండగ సెలవుల్లో భారీ సినిమాలు రిలీజ్ అవుతున్నాయి… చిన్న సినిమాలకు అవకాశం రావడం లేదన్నారు. అంతేకాకుండా.. ‘సగటు సినిమాలకు కూడా అవకాశం ఇవ్వాలి. తమిళ్ ఇండస్ట్రీలో అన్ని సినిమాలకు అవకాశం ఉన్నట్లే… ఇక్కడ కేసీఆర్ కూడా చేయాలి. జంతువులను హింసించలేదని.. సినిమాలలో వేస్తున్నాం.. కానీ ప్రొడ్యూసర్స్ కు ఇంకా హింస ఉంది. కొద్ది మంది కోసం.. ఫిల్మ్ ఇండస్ట్రీ ఉంది.. చిన్న నిర్మాతల ను కాపాడాలి.’ అని ఆర్ నారాయణమూర్తి వ్యాఖ్యానించారు.
నాలో ఆ మార్పులు వచ్చాయి..
అనసూయ భరద్వాజ్ ఈ భామ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.. బుల్లితెరపై యాంకర్ గా తన కెరీర్ ను ప్రారంభించింది ఈ భామ. సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్ గా ఉంటోంది. అయితే నిత్యం ఏదో ఒక కాంట్రవర్సీతో వార్తల్లో నిలుస్తూనే ఉంటుంది. ఎక్కువగా హీరో విజయ్ దేవరకొండను టార్గెట్ చేస్తూ సంచలన వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తూ ఉంటుంది ఈ భామ.అయితే రీసెంట్ గా విజయ్ దేవరకొండతో ఎప్పటినుంచో సాగుతున్న వివాదాన్ని ముగించింది.అలాగే అతడి తమ్ముడు ఆనంద్ దేవరకొండ సినిమాకు ఆల్ ది బెస్ట్ కూడా చెప్పింది. అంతేకాదు తన ఫ్యామిలీకి కూడా సమయం కేటాయిస్తోంది. ఈ క్రమంలోనే తన ఫ్యామిలీతో కలిసి వెకేషన్ ట్రిప్‌లకు కూడా వెళ్తోంది. అక్కడ ఫ్యామిలీతో కలిసి దిగిన ఫొటోలు మరియు వీడియోలను అభిమానులతో పంచుకుంటోంది.అయితే ఇదంతా చూసిన నెటిజన్స్ అనసూయ బిహేవియర్ లో చేంజ్ కనిపిస్తుంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు.ఈ క్రమంలోనే అనసూయ తాజాగా మరో కొత్త వీడియోను కూడా పోస్ట్ చేసింది.అందులో తనలో వచ్చిన మార్పులను గురించి తెలియజేసింది.. నా మైండ్ సెట్ మారిపోయింది. నా ప్రాధాన్యతలు,అభిరుచులు అన్ని మారాయి. నేను సహనంగా ఉండటాన్ని అలవర్చుకుంటున్నాను అని తెలియజేసింది.
మార్నింగ్ వాకింగ్కు వెళ్లి.. అనంత లోకాలకు
మృత్యువు ఏ రూపంలో వచ్చి బలి తీసుకుంటుందో తెలియదు. మార్నింగ్ వాకింగ్ కు అని వెళ్లిన ఇద్దరు మహిళలు.. అనంత లోకాలకు వెళ్లిపోయారు. రోడ్డుపైనే నడుచుకుంటు వెళ్తుండగా.. స్పోర్ట్స్ బైక్ ఢీకొట్టింది. ఈ ఘటనలో అక్కడికక్కడే ఇద్దరు మృతి చెందారు. బొల్లారం పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది.
వివరాల్లోకి వెళ్తే.. రీసాలా బజార్ కు చెందిన రాధిక (48) బొల్లారం కలాసిగూడ సాయి కాలనీకీ చెందిన పొలం బాలమని యాదవ్ (60) లు వీరిద్దరు మంచి స్నేహితులు. గత కొన్ని సంవత్సరాలుగా వీరు బొల్లారంలోని కంటోన్మెంట్ బోర్డు పార్క్ వద్ద మార్నింగ్ వాకింగ్ చేస్తున్నారు. అందులో భాగంగానే ఆదివారం ఉదయం 5 గంటల సమయంలో వాకింగ్ కు బయలుదేరారు. కొద్దిసేపట్లోనే కంటోన్మెంట్ బోర్డు పార్క్ లోపలికి చేరుకొనే క్రమంలో ఉప్పల్ కు చెందిన ఆదిత్య.. కావాసకి స్పోర్ట్స్ బైక్ తో వారిద్దరిని ఢీకొట్టాడు.