ఇటీవలే దాయాది పాకిస్థాన్‌ను ఓడించిన భారత జట్టు ఆసియా కప్ 2025ను గెలుచుకున్న విషయం తెలిసిందే. ఈ విజయం తర్వాత భారత జట్టు ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) చీఫ్, పీసీబీ అధ్యక్షుడు మోసిన్ నఖ్వీ నుంచి ట్రోఫీని స్వీకరించడానికి టీమిండియా నిరాకరించింది. దాంతో ఫైనల్ రోజు నఖ్వీ ట్రోఫీతో దుబాయ్‌లోని ఒక హోటల్‌కు వెళ్ళాడు. పాకిస్తాన్‌కు బయలుదేరే ముందు ట్రోఫీని ఏసీసీ కార్యాలయంలో ఉంచాడు. నఖ్వీ ట్రోఫీని భారత జట్టుకు ఇవ్వడానికి నిరాకరించాడు. కెప్టెన్ సూర్యకుమార్…