ACB Raids: ములుగు జిల్లాలో అవినీతి నిరోధక శాఖ (ACB) చేసిన మేజర్ ఆపరేషన్ చేసిన సంగతి వెలుగులోకి వచ్చింది. ములుగు జిల్లా డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ (DEO) కార్యాలయంలో ఏసీబీ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. కన్నాయిగూడెం మండలం, లక్ష్మీపురం గ్రామానికి చెందిన ఓ ఉద్యోగి జాయినింగ్ ఆర్డర్ కోసం డీఈఓ కార్యాలయంలో 20 వేల రూపాయలు లంచంగా డిమాండ్ చేసినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ముందస్తు సమాచారం మేరకు ఏసీబీ అధికారులు రైడ్ నిర్వహించారు.…