DUSU election: కాంగ్రెస్ పార్టీకి, రాహుల్ గాంధీకి ఢిల్లీ యూనివర్సిటీ విద్యార్థులు భారీ షాక్ ఇచ్చారు. దేశంలో ప్రతిష్టాత్మక ఢిల్లీ యూనివర్సిటీ స్టూడెంట్ యూనియన్(DUSU) ఎన్నికల్లో అఖిల భారతీయ విద్యార్థి సంఘం(ABVP) సత్తా చాటింది. నాలుగు టాప్ పోస్టుల్లో మూడింటిని గెలుచుకుంది. కాంగ్రెస్ విద్యార్థి సంఘం-స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియా(NSUI) కేవలం వైస్ ప్రెసిడెంట్ స్థానాన్ని గెలుచుకుంది.