కూరల్లో కారం కొంచెం ఎక్కువైనా.. చేతికి గాయం అయితే.. దానికి కారం తగిలినా అల్లాడిపోతాం.. అలాంటిది ఓ స్వామీజికి ఏకంగా ఒకటి కాదు రెండు కాదు 60 కేజీల కారంతో అభిషేకం చేశారు. మీరు చదివింది నిజమే.. అచ్చమైన కారంతోనే అభిషేకం. పూలతోనో, పాలతోనో, పంచామృతాలతోనో అభిషేకం అన్ని చోట్లా జరిగేదే.. కానీ ఇక్కడ కారాభిషేకానికి ఓ ప్రత్యేకత ఉందండోయ్.. మొదట స్వామిజీకి స్నానం చేయిస్తారు.