ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న మహిళ రిజర్వేషన్ బిల్లు చట్టంగా మారిన సంగతి తెలిసిందే. చట్టసభలలో మహిళలకు రిజర్వేషన్ కల్పించాలంటూ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన బిల్లుకు శుక్రవారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం తెలపడంతో చట్టంగా మారింది. ఇదిలా వుండగా మహిళా రిజర్వేషన్ చట్టంపై ఆర్జేడీ సీనియర్ నేత అబ్దుల్ బారీ సిద్ధిఖి సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ఈ చట్టంతో కేవలం లిప్ స్టిక్ వేసుకునే మహిళలే ప్రయోజనం పొందుతారన్నారు. బీహార్…