(ఆగస్టు 31న ఆరుద్ర జయంతి)తెలుగు సాహితీవనంలోనూ, తెలుగు సినిమారంగంలోనూ ఆరుద్ర ముద్ర చెరిగిపోనిది. చిత్రసీమలో ఆరుద్ర పాటలు, మాటలు జనాన్ని ఎంతగానో మురిపించాయి. ఇక సాహితీరంగంలో ఆరుద్ర పరిశోధనలు ఎన్నెన్నో తెలియని అంశాలను వెలుగులోకి తెచ్చాయి. అందుకే తెలుగువారికి సదాస్మరణీయులు ఆరుద్ర. తెలుగు సాహితీవనంలో నవకవనాలు విరబూస్తున్న రోజుల్లో శ్రీశ్రీ ఈ యుగం నాది అన్నారు. ఆయన స్థాయిలోనే ఆరుద్ర సైతం తన బాణీ పలికించారు. ఆ నాటి కవితాప్రియులను శ్రీశ్రీ తరువాత అంతగా ఆకట్టుకున్నది ఆరుద్ర…