బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ నటుడు ఆమిర్ ఖాన్ అభిమానులకు రేపు చాలా ప్రత్యేకమైన రోజు. ఒకవైపు.. దేశం మొత్తం రేపు హోలీ రంగులలో మునిగిపోతుండగా మరోవైపు, ఆమిర్ తన 60వ పుట్టినరోజును జరుపుకోనున్నారు. రేపు అంటే మార్చి 14న అమీర్ పుట్టినరోజు. ఈ నటుడు తన పుట్టినరోజుకు ఒక రోజు ముందు ముంబైలో అభిమానులు, ఫొటో గ్రాఫర్లతో కలిసి తన పుట్టినరోజును జరుపుకున్నాడు.