ప్రస్తుతం దేశంలోని అన్ని ప్రభుత్వ కార్యక్రమాలకు ఆధార్ నంబర్ తప్పనిసరిగా మారిపోయింది. సంక్షేమ పథకం అందాలంటే ఆధార్ ఉండి తీరాల్సిందే. స్కూల్‌లో అడ్మిషన్ కావాలన్నా.. బ్యాంక్ అకౌంట్ కావాలన్నా కూడా ఆధార్ కావాల్సిందే. ప్రస్తుతం ఏడాది దాటిన వారికే ఆధార్ ఇస్తుండగా ఇకపై పుట్టిన వెంటనే శిశువులకు ఆధార్ కార్డు జారీ చేయాలని అధికారులు నిర్ణయించారు. ఇందుకోసం భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (యూఐడీఏఐ) సన్నాహాలు చేస్తోంది. Read Also: ‘పుష్ప’ సెకండ్ పార్ట్ టైటిల్…
కర్నూలు జిల్లా శ్రీశైలంలోని భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయంలో ఆర్జిత సేవలకు ఆధార్ కార్డును తప్పనిసరి చేస్తున్నట్లు ఈవో లవన్న ప్రకటించారు. వీఐపీ బ్రేక్ దర్శనం, అభిషేకం టికెట్లు బుక్ చేసుకోవాలంటే ఆధార్ కార్డు తప్పనిసరిగా ఉండాలని ఈవో స్పష్టం చేశారు. ఆర్జిత సేవా టికెట్లు దుర్వినియోగం కాకుండా ఉండేందుకే తాము ఆధార్ నిబంధనను తీసుకొచ్చినట్లు ఈవో లవన్న చెప్పారు. Read Also: జనవరి 1 నుంచి విజయవాడలో బుక్ ఫెయిర్
మందు బాబులకు షాకింగ్ న్యూస్ చెప్పింది తమిళనాడు ప్రభుత్వం.. కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా కీలక నిర్ణయం తీసుకుంది.. ఇకపై ఆధార్ కార్డు, కరోనా వ్యాక్సిన్ వేయించుకున్నట్టు సర్టిఫికెట్ ఉంటేనే మద్యం విక్రయించే విధంగా నిర్ణయం తీసుకున్నారు.. అయితే, ఇది ప్రస్తుతానికి నీలగిరి జిల్లాలో అమలు చేస్తున్నారు. మద్యం కొనుగోలు చేయాలంటే ఆధార్ కార్డు, కరోనా టీకా వేయించుకున్న సర్టిఫికెట్ చూపించాల్సిందేనని స్పష్టం చేశారు అధికారులు… కాగా, నీలగిరి జిల్లాలో 76 మద్యం దుకాణాలుండగా రోజూ రూ.కోటి…
నెల్లూరు జిల్లాలోని కృష్ణపట్నంలోకి రావాలంటే తప్పని సరిగా ఆధార్ కార్డ్ తప్పని సరి చేశారు. ఆనందయ్య మందుకోసం ఇతర ప్రాంతాల నుంచి ప్రజలు తరలి వచ్చే అవకాశం ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. గ్రామస్తులు తప్ప మరెవరూ గ్రామంలోకి అడుగుపెట్టేందుకు వీలు లేదని, గ్రామస్తుకు కూడా బయట నుంచి గ్రామంలోకి రావాలంటే ఆధార్ కార్డు తప్పని సరి అని పోలీసులు చెబుతున్నారు. కృష్ణపట్నంలో ప్రస్తుతం 144 సెక్షన్‌ను కఠినంగా అమలు చేస్తున్నారు. గ్రామస్తులు తప్ప ఇతరులను గ్రామంలోకి…