గతవారం ఇటు థియేటర్లలో అటు ఓటీటీలో విడుదలైన సినిమాలలో దీపిక, యామీగౌతమ్ నటించిన సినిమాలే అగ్రస్థానంలో ఉన్నాయి. అమెజాన్ ప్రైమ్‌లో దీపిక నటించిన ‘గెహ్రాయియా’, డిస్నీ హాట్‌స్టార్‌లో యామీగౌతమ్ నటించిన ‘ఎ థర్స్ డే’ స్ట్రీమింగ్ అయ్యాయి. గత వారం ట్రాకింగ్ రిపోర్టులతో పాటు బాక్సాఫీస్ ట్రేడ్ ప్రకారం ఈ రెండు సినిమాలనే ప్రేక్షకులు అత్యధికంగా వీక్షించినట్లు తెలుస్తోంది. దీపికా సినిమా ట్రైలర్‌లో చూపించినట్లు వివాహేతర సంబంధం కాదు. లివ్ ఇన్ రిలేషన్‌షిప్‌లో ఉన్న వ్యక్తులు ఇతరులకు…
‘నువ్విలా, గౌరవం, యుద్ధం, కొరియర్ బోయ్ కళ్యాణ్’ వంటి సినిమాలతో తెలుగువారికి సుపరిచితురాలు యామి గౌతమ్. తెలుగుతో పాటు ఇతర భాషా చిత్రాల్లోనూ ఆమె హీరోయిన్ గా నటించింది. ఆ మధ్య వచ్చిన ‘కాబిల్, ఉరి, బాల’ వంటి చిత్రాలు ఉత్తరాదిన యామికి నటిగా మంచి గుర్తింపును తెచ్చిపెట్టాయి. యామీ గౌతమ్ కీలక పాత్ర పోషించిన లేడీ ఓరియంటెడ్ థ్రిల్లర్ మూవీ ‘ఏ థర్స్ డే’ ప్రస్తుతం డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతోంది.…