ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో ఆదివారం దారుణ ఘటన చోటుచేసుకుంది. పుట్టక ముందే ఓ పసికందును చంపేశారు. ఆ పిండాన్ని టాయిలెట్ పైపులో పారేశారు. ఇంటి టాయిలెట్ పైపులో కూరుకుపోయిన ఆరు నెలల పిండాన్ని యజమాని వెలికి తీశారు. ఈ మేరకు ఓ వార్తా సంస్థకు పోలీసులు సమాచారం అందించారు.