హైటెక్ సిటీకి కూతవేటు దూరంలో వున్న మాదాపూర్ వడ్డెరబస్తీ వాసులు కలుషిత నీటితో నానా అవస్థలు పడుతున్నారు. కలుషిత నీటి బాధితుల సంఖ్య క్రమంగా పెరగడం ఆందోళన కలిగిస్తోంది. కొత్తగా మరికొందరు అస్వస్థతకు గురికావడంతో మొత్తం బాధితుల సంఖ్య 98కి చేరింది. వాంతులు, విరేచనాలతో కొత్తగా 15 మంది కొండాపూర్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో చేరారని అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఆసుపత్రిలో 52 మంది చికిత్స పొందుతున్నారు. 26 మంది ఇప్పటివరకూ రికవరీ అయ్యారు. కొండాపూర్, గాంధీ…