1947లో భారత స్వాతంత్య్రంపై వివాదాస్పద ప్రకటన చేసినప్పటి నుంచి కంగనా రనౌత్ పలువురి ఆగ్రహానికి గురవుతూనే ఉంది. 1947లో భారత్‌కు లభించిన స్వాతంత్య్రాన్ని బ్రిటీష్ వారు భిక్షగా దేశానికి అందించారని కంగనా చేసిన కామెంట్స్ పై 91 ఏళ్ల స్వాతంత్ర్య సమరయోధురాలు లీలాబాయి మండిపడ్డారు. కంగనాపై చర్యలు తీసుకోవాలని ఆమె ప్రధాని నరేంద్ర మోడీని కోరారు. కంగనా ప్రకటనను దేశద్రోహ చర్యగా పేర్కొన్నారు లీలాబాయి. ఆమె మాట్లాడుతూ.. “నా పేరు లీలా చితాలే. నాకు 91 ఏళ్లు.…